బాలికపై రెచ్చిపోయిన కామాంధులు


 


ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాలికపై దారుణానికి ఒడిగట్టారు మృగాళ్లు.అంతటితో ఆగకుండా ఆ బాలిక ప్రాణాలు బలి తీసుకున్నారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామ శివారు సీతారాం తండాకు చెందిన ఓ మైనర్‌ బాలిక ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది.తల్లిదండ్రులకు చేదోడు వాడోడుగా ఉండేందుకు ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కిరాణా దుకాణం వరకు వెళ్లి వస్తానంటూ చెప్పి బయటకు వెళ్లింది.తర్వాత గంట సేపటికి గుట్టల్లో తీవ్ర రక్తస్రావంతో ఉన్నట్లు గ్రామస్తులు ఆమె తండ్రికి సమాచారం అందించారు.అప్పటికే ఆ మైనర్‌ బాలిక చనిపోయి ఉండడం చూసి బోరున విలపించారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడి చేసి, దారుణంగా చంపేశాడని ఆయన ఆరోపించారు గ్రామస్తులు దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Comments