షేర్లలో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్​వేర్​​ ఉద్యోగి ఆత్మహత్య



 AP, ప్రకాశం జిల్లా, మూలావారిపల్లి గ్రామానికి చెందిన మహాదేవరెడ్డి (35), సూర్యపేట జిల్లా కోడ మండలంలోని రామలక్ష్మిపురానికి చెందిన స్వప్నతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.ఇద్దరూ మహారాష్ట్రలోని పూణేలో సాఫ్ట్‌వేర్‌ గా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ .2.5 లక్షల వేతనం లభిస్తోంది. కరోనా 2020 డిసెంబరులో సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు జోన్ లోని ఇస్నాపూర్ లోని ఇల్లు అద్దెకు తీసుకుని ఇంటి నుంచే పని చేస్తున్నారు.ఈ నెలాఖరులో భార్య జీతం భర్త మహదేవరెడ్డి ఇచ్చేది. అతను అందుకున్న డబ్బుతో షేర్లలో పెట్టుబడి పెట్టాడు. షేర్లు పడిపోవడంతో ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లిందిఅప్పుల పాలయ్యాడు .తనలోనే మదనపుడుతూ ఉండేవాడు. ఫిబ్రవరిలో భర్తను ఎందుకు ఇలా ఉంటున్నారని స్వప్న నిలదీయగా షేర్లలో పెట్టడంతో అప్పులుపాలయ్యానని చెప్పాడు. ఆమెకున్న బంగారం అమ్మి రూ. 20 లక్షలు భర్తకు ఇచ్చింది. ఇంకా రూ. 60 లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పాడు భర్త మిగతా అప్పులు త్వరలో తీరుద్దామని చెప్పింది స్వప్న. ఉన్నట్టుండి ఆదివారం ఉదయం ఇంట్లో కిటికీకి లుంగీతో ఉరేసుకుని బలవన్మరణానికి(Suicide) పాల్పడ్డాడు మహదేవరెడ్డి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments