తెలంగాణ ;కోవిడ్ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ కొరడా చూపించింది.
ఇవాళ మరో ఆరు ఆసుపత్రుల లైసెన్సుల రద్దు.బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వైద్యశాలల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.తాజాగా రాష్ట్రంలో ఈరోజు మరో ఆరు ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కిమ్స్ (సికింద్రాబాద్) , సన్‌షైన్ (గచ్చిబౌలి), సెంచరీ (బంజారాహిల్స్), లోటస్ ( లక్డీకాపూల్ ), మెడిసిన్ (ఎల్బీనగర్), ఇంటెగ్రో (టోలీచౌకి) దవాఖానలు ఈ జాబితాలో ఉన్నాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 కోవిడ్ ఆసుపత్రుల లైనెన్స్‌లు రద్దయ్యాయి.ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన 113 ప్రైవేట్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
Comments
Post a Comment