నకిలీ బిల్లులతో బీమా ....తెలుగు వ్యక్తికి 20 ఏళ్ల జైలు

 


అమెరికా;సుమారు 40 కోట్ల రూపాయలను బీమా సంస్థలకు తిరిగి చెల్లించాలని ఆదేశం అమెరికా లో నర్సుగా ప్రాక్టీస్‌ చేస్తున్న త్రివిక్రమ్‌రెడ్డి(39) అనే వ్యక్తి నకిలీ బిల్లులతో స్థానిక మెడికేర్‌ సంస్థలతో పాటు ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను మోసం చేశాడన్నఅభియోగాలపై విచారణ జరిపిన ఫెడరల్‌ కోర్టు.నేరం రుజువు కావడంతో మేరకు శిక్ష విధించింది. అతడు మోసానికి పాల్పడ్డాడని చెబుతున్న 55 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 40 కోట్లు)ను తిరిగి చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.త్రివిక్రమ్‌రెడ్డి.. తనకున్న నర్సు లైసెన్సుతో ఓ క్లినిక్‌ను నడుపుతూ.. అక్కడికి వస్తున్న పేషెంట్ల పేరుతో నకిలీ ట్రీట్‌మెంట్‌ రికార్డులను సృష్టించి.. ఆ పేర్లతో ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి సొమ్ము కాజేసేవాడు. 2019లో అనుమానంతో అతడి క్లినిక్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో విషయం బయటపడింది.

Comments