మాయమాటలతో మొబైల్​​ షాప్​ఓనర్​కి 80 లక్షలు కు తోకారా

 


Vijyawada;-కన్సల్టెంట్ పేరిట భారీ కుంభకోణం చేసినందుకు కిలాది లేడీపై కృష్ణ జిల్లా ఇబ్రహీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ మరమ్మతు కోసం వచ్చిన శ్రీదివ్య అనే యువతి దుకాణ యజమానిని పరిచయం చేసుకుని. రోజువారీ ఫోన్ కాల్స్ చేయడం ద్వారా పరిచయము పెరిగింది. తన వద్ద వందల కోట్ల రూపాయల విలువైన పొలం ఉందని, రూ .80 లక్షల విలువైన భూమి తాకట్టులో ఉందని ఆమె చెప్పారు.సెల్‌ఫోన్ షాపు యజమాని శివకృష్ణ తనకు భూమిని విడిపించేందుకు డబ్బు కావాలని చెప్పింది. తాకట్టులో నుండి విడుదలయ్యాక భూమిని అమ్మితే తనకు డబ్బు వస్తుందని చెప్పి శ్రీదివ్య తన నుంచి నగదు తీసుకున్నట్లు బాధితుడూ ఫిర్యాదులో చెప్పాడు. అతను 80 లక్షల వాయిదాలలో ఇచ్చాడని వాపోయాడు .తన సోదరుడితో పాటు, రజాక్ అనే మరో వ్యక్తి ఇదే విధంగా మరికొంత మంది నుండి డబ్బు తీసుకొని శ్రీదివ్య తనను మోసం చేశాడని వివరించాడు. ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీపట్నం పోలీసులు నిందితులపై మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments