జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంపై తల్లిదండ్రులు కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన మంగళవారం రాయచోటిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయచోటికి చెందిన ఒక యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది.ఈ ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఆమెతో మరో సంబంధం కోసం వెతుకుతున్నారు . అయితే, ఆమె వచ్చిన అన్ని సంబంధాలను పాడుచేస్తోంది. ఆమె కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతోంది.ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు ఆమెను వివాహం అనే అంశంపై బలవంతం చేయడంతో ఆమె మరోసారి నిరాకరించింది.
ఆమె తల్లిదండ్రులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి అరుస్తుండగా, ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు.
AtoZupdates.in;-Andhra Pradesh Telangana News Crime Cinema Jobs Offer Products
Comments
Post a Comment