‘పుష్ప’ మూవీ లో హీరో తరుణ్‌


 

ఒకప్పుడు టాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీ చిత్రాలలో నటించిన హీరో తరుణ్ లవర్ బాయ్ గా ప్రసిద్ది చెందారు. దివంగత నటి ఆర్తి అగర్వాల్‌తో ప్రేమ వ్యవహారం వల్ల తరుణ్‌కు అవకాశాలు తగ్గుతాయి.అప్పటినుండి సినిమాలకు దూరంగా ఉన్న తరుణ్ అప్పటినుండి పలు సినిమాల్లో నటించినా వాటికి పెద్దగా గుర్తింపు రాలేదు.మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణ్‌ను 'పుష్ప' మూవీ టీం ఇటీవల సంప్రదించింది.అయితే ఏ కీ రోల్‌ కోసమో అనుకుంటే మీరు పొరపాటు పడ్డంటే. అవును..

తమ సినిమాకు వాయిస్‌ అందించాలని మేకర్స్‌ తరుణ్‌ కోరినట్లు వినికిడి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రదర్శిస్తున్న 'పుష్ప'లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.అతనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మేకర్స్ ఫహద్ ఫాజిల్‌తో చర్చలు జరుపుతున్నారు.అన్నీ సరిగ్గా జరిగితే, త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. ప్రేక్షకులను అలరించడానికి తరుణ్ బయటకు వచ్చి చాలా కాలం అయ్యింది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్న నటిస్తుండగా .. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Comments