ఒంగోలులో దారుణం యువతిని తీసుకెళ్లి అత్యాచారం

 Ongole దారుణం జరిగింది. ఎస్సై రమ్మన్నాడంటూ ఓ యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు దుండగుడు. స్నేహితుడితో బయటకు వెళ్లిన యువతిని టూ వీలర్ పై వచ్చిన ఓ వ్యక్తి యువతిని వెంబడించాడు. నీ వీడియోలు తన వద్ద ఉన్నాయని యువతిని బెదిరించాడు. అయితే తానేమి తప్పు చేయలేదనియువతి బదులివ్వడంతో ఖంగుతిన్న ఆ యువకుడు వెంటనే మాటమార్చి ఎస్సై స్టేషన్ కు రమ్మన్నాడని చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతి అతని బైక్ ఎక్కింది. కొత్త మామిడిపాలెం రోడ్డుకు తీసుకెళ్లిన అతను యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడి వదిలేశాడు.ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది యువతి. స్నేహితులిచ్చిన ధైర్యంతో గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Comments