తొలి విజయం రుచి తెలిసింది

 

గోల్కొండ హైస్కూల్‌'తో ప్రయాణం మొదలుపెట్టిన సంతోష్ 'తను నేను', 'పేపర్‌బాయ్‌' తదితర చిత్రాలతో మెరిశాడు


పదేళ్లుగా నా ప్రయాణం సాగుతోంది. తొలి విజయం రుచి ఎలా ఉంటుందో ఈ సినిమాతోనే తెలిసింది. ఆ విజయం అందించిన ప్రోత్సాహం, దాని తాలూకు అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మనందరి జీవితాల్లో చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అసలు అది సమస్యో కాదో తెలియకుండానే ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సున్నితమైన విషయాల్ని స్పృశించిన కథే ఇది.

ఎలాంటి అండ లేకపోయినా నా ప్రతిభని నమ్మి అవకాశం ఇచ్చింది యు.వి.క్రియేషన్స్‌. ఇదే సంస్థలోనే వరుసగా సినిమాలు చేస్తున్నా. వైజయంతీ మూవీస్‌ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఓ కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది. అలాగే అభిషేక్‌ మహర్షి అనే నా మిత్రుడి దర్శకత్వంలో, సారంగ ప్రొడక్షన్స్‌ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా.

Comments