HYD మూడో అంతస్థు నుంచి దూకిన యువతి

 ప్రేమిస్తున్నానని చెప్పి, నమ్మించి మోసం చేశాడని మనస్థాపం చెందిన ఓ యువతి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.శైలజ (23) బీటెక్‌ చదువుతోంది. ఎదురు ప్లాట్‌లో నివసించే పవన్‌ కల్యాణ్‌ అలియాస్‌ సన్ని (25) శైలజకు ఇంట్లో ట్యూషన్‌ చెప్పడానికి వస్తుండేవాడు.ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సన్నీ, శైలజను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పగా, ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.వారు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడగా అందుకు వారు ఒప్పుకోకపోగా, కులం పేరిట దూషించి, చంపేస్తానని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత శైలజను కలిసిన సన్నీ నెల రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు.మనస్థాపానికి గురైన యువతి గురువారం రాత్రి భవనం మూడో అంతస్థు నుంచి దూకింది




Comments