టిక్‌టాక్‌లో పరిచయం

 తాడిపత్రి ప్రాంతానికి చెందిన పులుకూరు నవీన్‌ (23) లా రెండో సంవత్సరం చదువుతూ ఓ సంస్థలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఇతడు టిక్‌టాక్‌ వీడియోలు పెడుతూ యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపేవాడు. యాక్సెప్ట్‌ చేసిన వారితో చాటింగ్‌ చేస్తూ పరిచయం పెంచుకునేవాడు.ఓ సోషల్‌ యాప్‌లో శంకరపల్లి ప్రాంతానికి చెందిన యువతికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడు. యాక్సెప్ట్‌ చేసిన యువతితో తరచూ చాటింగ్‌, ఫోన్‌ చేసి మాట్లాడేవాడు. పరిచయం పెంచుకొని ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు సేకరించాడు.

< div class="separator" style="clear: both; text-align: center;">

తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమె కుటుంబ సభ్యులను హతమార్చుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.ఇదేవిధంగా నగరానికి చెందిన యువతిని వేధింపులకు గురిచేసిన ఇతడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Comments