కాలేజీలో ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు

 ఎనిమిదేళ్ల క్రితం అనిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులుగా నలుగురు విద్యార్థినులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.కాలేజీలో సరదా పేరుతో ర్యాగింగ్ చేసి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన నలుగురు విద్యార్థినుల పట్ల జిల్లా హైకోర్టు కఠినంగా వ్యవహరించింది.కేసు ఎనిమిదేళ్లుగా నడవడం వల్ల శిక్షకు గురైన విద్యార్థినిలు ఇప్పటికే పెళ్లిళ్లు అయినా.. ఉద్యోగాలు చేసుకుంటున్న నేపధ్యంలో కోర్టు తీర్పు కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో అనిత అనే విద్యార్థిని బీఫార్మశీ కోర్సు చేరింది. కాలేజీలో చేరిన వెంటనేనలుగురు సీనియర్ అమ్మాయిలు అనితను ర్యాగింగ్ పేరుతో వేధించేవారు.అయితే అనిత విషయంలో ఏడాది వరకు ర్యాగింగ్ కొనసాగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత కాలేజీలో ప్రిన్సిపాల్ కు, లెక్చరర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.నలుగురు యువతులు ర్యాగింగ్ కు పాల్పడడం వల్లే ఆత్మహత్యకు దారితీసిందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి విషయాలు క్షమించరానివని.. ఇతర కాలేజీల్లో..మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకూడదంటే శిక్ష వేయాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. తప్పు చేస్తే శిక్ష తప్పదని కోర్టు తన తీర్పుతో స్పష్టం చేసింది.Comments