ప్రియురాలితో గదిలో ఏకాంతంగా చిత్తూరు జిల్లాలో పరువు హత్య
పలమనేరు మండలం పెంగరగుంట గ్రామంలో ధనశేఖర్ అనే యువకుడి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియరాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె తండ్రి చూడటంతోనే ఈ దారుణం జరిగినట్లు సమాచారం.
తన కుమార్తెను ప్రేమించడంతోపాటు.. వద్దని హెచ్చరించినా లెక్కచేయకుండా నేరుగా తన ఇంటికే వచ్చి, తన కూతురితో గదిలో కనిపించిన యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ గంగయ్య కథనం మేరపలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన రైతు బాబు(45)కు భార్య, కుమారుడు, 10వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. బాబు కుమార్తెకు అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ అలియాస్ ధను్ష(23)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.ఈ విషయం తెలిసి.. ధను్షను బాబు గతంలో హెచ్చరించాడు. దీంతో ధనుష్ బెంగళూరుకు వెళ్లిపోయి మినరల్ వాటర్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21న ధనుష్ పెంగరగుంటకు వచ్చాడు. 22వ తేదీ రాత్రి బాబు పొలంవద్దకు వెళ్లగాఆయన కుమార్తె తండ్రి ఫోన్ ద్వారా ధను్షకు కాల్ చేసి ఇంటికి రమ్మంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో బాబు ఇంటికి వచ్చిన ధనుష్.. నేరుగా ఆయన కుమార్తె ఉన్న గదిలోకి వెళ్లాడు.పొలం నుంచి తిరిగి వచ్చిన బాబుకు కుమార్తె గదిలోంచి గుసగుసలు వినిపించి.. ఆ గదిలోకి వెళ్లాడు. ఆ గదిలో కుమారుడు ఒకవైపు నిద్రిస్తుండగా, కుమార్తె పక్కనే ధనుష్ ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయాడుఘటనలో ధనుష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఓ ప్లాసిక్ సంచిలో చుట్టి తన ద్విచక్రవాహనం వెనుక కట్టి సమీపంలోని చిన్నకుంట గ్రామం వద్దకు తీసుకువెళ్లి ఓ బావిలో పడేశాడు
Comments
Post a Comment