ఏపీలో 100 దాటేసిన పెట్రోల్

 నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నిక‌ల పుణ్య‌మా అని.. కొంత కాలం పెట్రో బాదుడుకు బ్రేక్ ప‌డ‌గా.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మైంది… ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర‌… విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా


స్పీడ్ పెట్రోల్ ధ‌ర రూ.102.47కు పెరిగింది.. ఇక‌, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.94.12గా ప‌లుకుతోంది.. గత నాలుగు రోజులుగా వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుల‌కు గుబులు పుట్టిస్తున్నాయి పెట్రోల్ ధ‌ర‌లు

Comments