ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై సందిగ్ధం

 ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై సందిగ్ధం    AP లో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం సందిగ్ధంలో పడింది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.ఏపీ సర్కార్ .. ఆ దిశగా సన్నాహాలు సైతం మొదలుపెట్టింది. కానీ కేంద్రం కొత్త జిల్లాల పై చేసిన ప్రకటనతో ఏపీ సర్కార్ కసరత్తు ముందుకు సాగేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విజయవాడకు చెందిన ఈనగంటి రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై సమాచారం ఇవ్వాలని కోరారు.


Comments