ప్రభాస్ దీపికా పదుకొణె

 బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే వందల కోట్లతో నిర్మాణమే. ప్రస్తుతం అతడు నటిస్తున్న 'సలార్', 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్' అలాంటి చిత్రాలే. అయితే వీటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్.. మరింత భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది


ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. అయితే కేవలం నటీనటులకు ఇచ్చే రెమ్యునరేషన్ రూ.200 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇంకా గ్రాఫిక్స్, ఇతరత్రా మొత్తం కలిపితే భారీ బడ్జెట్​ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే సంవత్సరం మొదట్లో ప్రారంభమవొచ్చు

Comments