నా భర్త స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి అసలు సిసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డే

 Laxmi Parvathi;నా భర్త స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి అసలు సిసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డే


    తన భర్త.. మహానటుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన స్వర్గీయ నందమూరి తారకరామారావు అసలైన వారసుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డేనని చెప్పారు నందమూరి లక్ష్మీపార్వతి. కడుపున పుట్టినంత మాత్రాన వారసులు కారన్న ఆమె… అతని ఆశయాలు అమలు చేసే వారే అతని సిసలైన వారసులని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను అనేక సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్నారని ఆమె చెప్పారు.దివంగత ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్‌‌లో లక్ష్మీ పార్వతి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు. అటు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ఉంటుందని తెలిపారు.ఎన్టీఆర్ ఆశీర్వాదం, పేదల ఆశీర్వాదం వల్లే తాను మళ్ళీ బతికానన్నారు. వ్యవస్థ బాగు పడాలని అవినీతి రహిత పాలన అందించాలని పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తాను వేరే పార్టీలో ఉన్నా.. ఆయన శిష్యుడిగా మహనీయుడు జయంతి నాడు స్మరించుకుంటున్నానని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.Comments