ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు

 Kakinada; ప్రభుత్వ నిబంధనలను పాటించని ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పెద్దాపురానికి చెందిన కరోనా రోగి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేస్తూ రూ.4.50 లక్షలను ఆస్పత్రి సిబ్బంది వసూలు చేశారు.

  

ఆస్పత్రిపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇనోదయ ఆస్పత్రిని డీ నోటిఫై చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆస్పత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయనున్నారు. దీంతో పాటు ఆస్పత్రికి రూ.15-20 లక్షల జరిమానా కూడా విధించారు. ఆస్పత్రి యాజమాన్యంకు సహకరించిన ఆరోపణలపై ఆరోగ్య మిత్ర నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.


Comments