చైనాలో మళ్లీ కరోనా కలకలం

 బీజింగ్‌లోని గ్వాంగ్జౌ సిటీలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు.ఐదు నెలల తర్వాత భారీగా కేసులు దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్వాంగ్జౌలో ప్రజలు ఎవరూ బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కనుగొన్న కొత్త స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమైనదని, స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌ కథనాన్ని ప్రచురించింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 103 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో చివరిగా గతేడాది జులై 30న అత్యధికంగా 127 కేసులు నమోదు కాగా, మళ్లీ ఐదు నెలల తర్వాత వంద పైచిలుకు కొత్త కేసులు వచ్చాయి.Comments