తప్పుదోవ పట్టించి కుమార్తె పై అత్యాచార యత్నం

 తల్లిని తప్పుదోవ పట్టించి మైనర్ అయిన ఆమె కుమార్తె(13)పై అత్యాచారానికి యత్నించిన ఘటన జగద్గిరిగుట్టలో జరిగింది. జిహెచ్ఎంసి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ నేరానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధి మహదేవపురం లో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రం (Animal Care Center)లో షెల్టర్ మేనేజర్ గా గత కొన్నాళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ రావు(45) కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే బాలిక తల్లి రహేమా కాపలాదారుగా పనిచేస్తోంది. మరో వ్యక్తి పారవెంట్ (జంతువుల బాగోగులు చూసుకునే వ్యక్తి) తరుణ్ సైతం అక్కడే ఉంటాడు.


                       అయితే తరుణ్ మరియు కాపాలదారు రహేమ కుటుంబానికి ఒకే కామన్ బాత్రూమ్ ఉంది. ఇవాళ ఉదయం బాలిక తల్లి రహేమాను తప్పుదోవ పట్టించి ఆమెకు ఇతర పని అప్పగించాడు భాస్కర్ రావు. అనంతరం బాలిక(13) ఉదయాన్నే లేచి బాత్రూమ్ కు వెళ్లగా అప్పటికే ప్లాన్ వేసుకున్న భాస్కర్ రావు బాత్రూమ్ లో దాచుకున్నాడు. బాలిక లోపలికి వెళ్లగా అక్కడే ఉన్న భాస్కర్ రావు(45) ఆ బాలిక పై అత్యాచారానికి యత్నించాడు.
బాలిక భయంతో అరుపులు, కేకలు వేసుకుంటూ బాత్రూమ్ డోర్ తెరిచి బయటకు పరుగెత్తుకు వచ్చింది. వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి కంటతడిపెట్టుకుని విషయం తెలిపింది. దీంతో స్పందించిన ఆమె తల్లి ఫిర్యాదు చేయడానికి జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ కు బయలుదేరుతుండగాబాలిక తల్లిని కాంప్రమైజ్ కావాలని బెదిరింపులు గురి చేసినట్లు తోటి ఉద్యోగులు ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగలంటూ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు తోటి ఉద్యోగులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Comments