పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయేల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో జనం భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 42 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. మూడు భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇంత భారీ స్థాయిలో విధ్వంసం జరగడం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ భవనం కూడా ధ్వంసమయ్యింది.
Comments
Post a Comment