అల్లు శిరీష్ తాజా చిత్రం

 


అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ రొమాంటిక్ పిక్ తో సినిమాపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రం నుంచి మరో రొమాంటిక్ ప్రీ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అను, శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్నారు.

ఇక మే 30న అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల అవుతుంది. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నారు. రాకేష్ గతంలో కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ “విజేత” చిత్రాన్ని రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.

Comments