బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సత్యదేవ్‌

 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదిచుకున్న సత్యదేవ్‌ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామ్‌సేతు' లో సత్యదేవ్‌కు అవకాశం వచ్చినట్లు బీటౌన్‌ టాక్‌. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సుష్రత్‌ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్‌ చేయాలని భావిస్తోందట చిత్ర బృందం


ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ నుంచి సీనియర్‌ నటుడు నాజర్‌, తెలుగు నుంచి సత్యదేవ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ ఏడాది మార్చిలోనే ఈ చిత్ర షూటింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభమయినా కరోనా కారణంగా షూటింగ్‌కు  బ్రేక్‌ పడింది


Comments