మూడు ఫంగస్‌లతో పాజిటివ్‌ వ్యక్తి మృతి

 కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తికి మూడు ఫంగస్ లు సోకి చనిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో జరిగింది. స్థానిక సంజయ్ నగర్ కు చెందిన 59 ఏళ్ల కున్వర్ సింగ్ అనే లాయరు కరోనా సోకగా, ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగతో పాటు ఎల్లో ఫంగస్ ను వైద్యులు గుర్తించారు
శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూ కున్వార్ సింగ్ చనిపోయారు. కాగా.. ఇదే ఆసుపత్రిలో మురాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో 59 ఏళ్ల వ్యక్తి రాజేశ్‌ కుమార్‌కు ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రాజేశ్ కుమార్‌ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు.

Comments