బ్లాంక్ ఫంగ‌స్ చికిత్స పేరిట భారీ మోసాలు

  ఓవైపు క‌రోనా క‌ష్ట కాలంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మ‌రోవైపు మోస‌గాళ్లు ఇదే అదునుగా మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు


తాజాగా బ్లాక్ ఫంగ‌స్ చికిత్స పేరుతో సైబ‌రాబాద్ ప‌రిధిలో ఇలాంటి మోసాలే వెలుగులోకి వ‌చ్చాయి.తాజాగా హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలికి చెందిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్‌లో బ్లాక్ ఫంగ‌స్ చికిత్సకు ఉప‌యోగించే మెడిసిన్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడు. ఇందులో భాగంగా ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో ఓ వ్య‌క్తి కాంటాక్ట్ నెంబ‌ర్ ల‌భించింది.అనంత‌రం వాట్సాప్ ద్వారా స‌ద‌రు వ్య‌క్తిని అప్రోచ్ కాగా.. విమానం ద్వారా బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల‌ను పంపిస్తాన‌ని ఇందుకోసం 60 ఇంజెక్ష‌న్ల‌ను గాను రూ. 8,32,300 పంపించ‌మ‌ని అడిగాడు. స‌ద‌రు వ్య‌క్తి చెప్పిన అకౌంట్ నెంబ‌ర్‌కు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు. తీరా డ‌బ్బులు వెళ్లిన త‌ర్వాత ఫోన్ కాల్ లిఫ్ట్ చేయ‌డం ఆపేశాడు.దీంతో బ్లాక్ ఫంగ‌స్ కోసం ప్ర‌య‌త్నించిన స‌ద‌రు హైద‌రాబాద్ వాసి మోసాపోయాన‌ని ఆల‌స్యంగా తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Comments