ఫ్లై ఓవర్‌ పై నుంచి దూకిన మహిళ

HYD; ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ పై నుంచి లేక్‌వ్యూ పార్కులోకి దూకగా గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మానసిక వేదనతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

       సైఫాబాద్‌ ఎస్‌ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం జీడిమెట్ల సూరారానికి చెందిన కోమటి చందన(22) పీజీ పూర్తి చేసి పీహెచ్‌డికి ప్రయత్నిస్తోంది. 2 సంవత్సరాల క్రితం బి.నరేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దీనిని ఆమె కుటుంబీకులు అంగీకరించలేదు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చందన ఆర్టీసీ బస్సులో ఖైరతాబాద్‌కు వచ్చి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద గల బస్‌ స్టాప్‌లో దిగి నడుచుకుంటూ ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ పైకి వచ్చింది.అక్కడి నుంచి ఆమె కింద ఉన్న లేక్‌వ్యూ పార్కులోకి దూకడాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పార్కు సెక్యూరిటీని అప్రమత్తం చేయడంతో 108 ఆంబులెన్స్‌లో యశోదా ఆస్పత్రికి తరలించారు.               

Comments