బిర్యానీలో మసాలా రాలేదని మంత్రి కేటీఆర్ కి ట్వీట్

 బిర్యానీలో మసాలా రాలేదని మంత్రి కేటీఆర్ కి ట్వీట్


ఓ వ్యక్తి ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టానని, కానీ అవేమీ రాలేవంటూ మంత్రి కేటీఆర్, జోమోటోను ట్యాగ్ చేశాడు.
ట్విట్టర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ కి వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టానని, కానీ అవేమీ రాలేవంటూ మంత్రి కేటీఆర్, జోమోటోను ట్యాగ్ చేశాడు. అయితే అతను చేసిన ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఈ విషయంపై తననెందుకు ట్యాగ్ చేశావని మంత్రి కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. తన నుంచి ఏం కోరుకుంటున్నావ్ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్‌ వైరల్ కావడంతో తన పరువు పోయిందని కాబోలు ఆ యువకుడు తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments